: పైన కోళ్ల దాణా... అడుగున కోటిన్నర రూపాయల క్యాష్
కోటిన్నర రూపాయలు పట్టుకున్న పోలీసులు రెండు రోజులుగా ఆ విషయాన్ని బయటకు చెప్పకుండా దాచి పెట్టారు. ఆలస్యంగా ఆ విషయం వెలుగు చూసింది. హైదరాబాద్ నుంచి ఓ వాహనం ప్రకాశం జిల్లా వైపు నాగార్జున సాగర్ రోడ్డులో వెళుతోంది. పోలీసులు చింతపల్లి వద్ద ఆపి తనిఖీ చేశారు. పైన కోళ్లదాణా ఉంది. అనుమానం వచ్చే అవకాశమే లేదులే అనుకున్నారేమో, అడుగున కోటిన్నర రూపాయలు దాచి ఉంచారు. కానీ, పోలీసులు వాహనాన్ని పూర్తిగా తనిఖీ చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. అయినా ఆ విషయాన్ని పోలీసులు బయటకు వెల్లడించకపోవడం అనుమానాలకు తావిస్తోంది.