: వైఎస్ పాలన గురించి పవన్ తెలుసుకుని మాట్లాడాలి: వాసిరెడ్డి పద్మ


దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన వల్లే తెలంగాణ సమస్య తెరపైకి వచ్చిందన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ మండిపడింది. ముందు మహానేత వైఎస్ పాలన గురించి పవన్ తెలుసుకుని, చదువుకుని మాట్లాడాలని ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ సలహా ఇచ్చారు. ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న వైఎస్ గురించి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని ఆమె అన్నారు. అతని తిక్కకు లెక్కే లేదన్నారు. వైఎస్ చనిపోతే ఎంతోమంది గుండెలు ద్రవించిపోయాయని, అలాంటి వ్యక్తిని విమర్శించే హక్కు, ఆయన కాలిగోటికి కూడా సరిపోని పవన్ కు ఎక్కడ ఉందని పద్మ ప్రశ్నించారు. విభజన వాదులను పక్కన పెట్టుకుని వైఎస్సార్సీపీపై విమర్శలు చేయడం తగదన్నారు.

  • Loading...

More Telugu News