: కైలాస మానస సరోవరాన్ని దర్శించేందుకు 1080 మందికి అనుమతి
కైలాస మానస సరోవరాన్ని దర్శించుకునేందుకు 1080 మందికి అనుమతి లభించింది. న్యూఢిల్లీలో భారత విదేశాంగ శాఖ కార్యదర్శి సుజాతా సింగ్ సమక్షంలో కంప్యూటర్ డ్రా ద్వారా యాత్రికులను ఎంపిక చేశారు. వీరిని 18 బృందాలుగా పంపుతామని సుజాతా సింగ్ వెల్లడించారు. టిబెట్ లో జూన్ 12న మానస సరోవర యాత్ర ప్రారంభం కానుంది. ఈ యాత్ర భారత్, చైనా దేశాల మధ్య స్నేహ సహకారాలకు ప్రతీక అని ఆమె అభివర్ణించారు.