: మంగళవారం చెన్నైలో ఉగ్రవాది అరెస్ట్.. ఈ రోజు పేలుళ్లు


తమిళనాడు రాజధాని చెన్నైతోపాటు పలు నగరాల్లో బాంబు పేలుళ్లతో విధ్వంసానికి ఉగ్రవాదులు కుట్ర పన్నారని బయటపడింది. మంగళవారం రాత్రి నగరంలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు మన్నడి ప్రాంతంలో ఓ అనుమానిత వ్యక్తి పట్టుబడ్డాడు. విచారణలో అతడు శ్రీలంకకు చెందిన మహమ్మద్ జాకీర్ హుస్సేన్ (37) గా గుర్తించారు. అతడు పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్ అని తేలింది. పాకిస్థాన్ నుంచి భారత్ రావడం కష్టతరం కావడంతో ఉగ్రవాదులు శ్రీలంకలో స్థావరం ఏర్పాటు చేసుకుని, సముద్ర మార్గంలో రహస్యంగా చెన్నై వస్తున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. చెన్నైతో పాటు పలు నగరాల్లో బాంబు పేలుళ్లకు తాము కుట్ర పన్నినట్లు ఉగ్రవాది జాకీర్ హుస్సేన్ వెల్లడించాడు. అయితే, అతడు పట్టుబడిన 48 గంటల్లోపే చెన్నై రైల్వే స్టేషన్లో బాంబు పేలుళ్ల జరగడం సంచలనం. దీన్నిబట్టి అతడు చెప్పింది అక్షరసత్యమని తెలుస్తోంది. అతడు చెప్పిన తర్వాత అయినా, పోలీసులు అప్రమత్తం కాకపోవడం వారి నిర్లక్ష్యాన్ని బయటపెట్టింది. అతడిచ్చిన సమాచారంతో తనిఖీలు చేసి ఉంటే ఈ ఉదయం బాంబు పేలుళ్లు జరిగేవి కావేమో!

  • Loading...

More Telugu News