: బాంబు పేలుళ్లతో తిరుమలలో పోలీసుల హై అలర్ట్
చెన్నై రైల్వే స్టేషన్లలో బాంబు పేలుళ్లు జరిగిన నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. ముఖ్యంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతి, తిరుమలలో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. కనుమ దారిలో ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతిస్తున్నారు.