: విడాకులకు దరఖాస్తు చేసుకున్న హృతిక్ రోషన్ దంపతులు
బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, అతని భార్య సుజన్నే విడాకుల కోసం ముంబయి సబర్బన్ బాంద్రాలోని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు వారిద్దరూ పరస్పర ఆమోదంతో దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తుపై నవంబర్ లో కోర్టు విచారణ చేపట్టనుంది. వ్యక్తిగత కారణాల వల్ల గతేడాది డిసెంబరు 14న తామిద్దరమూ విడిపోతున్నట్లు హృతిక్, సుజన్నేలు స్వయంగా మీడియాకు వేరు వేరు ప్రకటనలు విడుదల చేశారు. అప్పటినుంచి సుజన్నే తన తల్లిదండ్రుల వద్దే ఉంటోంది.