: 12 మంది కాంగ్రెస్ నేతలకు 6 ఏళ్ల సస్పెన్షన్
12 మంది కాంగ్రెస్ నేతలను 6 ఏళ్ల పాటు సస్పెండ్ చేస్తూ ఆ పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. జార్ఖండ్ రాష్ట్రంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని 12 మంది నేతలను 6 సంవత్సరాలపాటు సస్పెండ్ చేస్తున్నట్టు జార్ఖండ్ పీసీసీ చీఫ్ సుఖ్ దేవ్ తెలిపారు. వీరిలో జార్ఖండ్ ఉప ముఖ్యమంత్రి స్టీఫెన్ మారింది, మాజీ మంత్రులు చంద్రశేఖర్ దుబే, నియల్ టిర్కి ఉన్నారు.