: భన్వర్ లాల్ వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదు
చంద్రబాబు ఓటు చెల్లదంటూ కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర అధికారి భన్వర్ లాల్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. తన పరిధిలో లేని అంశాన్ని భన్వర్ లాల్ ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించింది. ఓటు చెల్లదని నిర్ణయం తీసుకునే అధికారం భన్వర్ లాల్ కు లేదని తెలిపింది. ఈ విషయంపై కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదు చేసింది. పోలింగ్ బూత్ కు 100 మీటర్ల దూరంలో చంద్రబాబు మాట్లాడారని టీడీపీ శ్రేణులు తెలిపాయి. డబ్బు, మద్యం పంపిణీలాంటి అంశాల్లో ఏమీ చేయలేని ఎలక్షన్ కమిషన్... ఇలాంటి చిన్న విషయాన్ని మాత్రం పట్టించుకోవడం ఎంతవరకు సబబని ప్రశ్నించాయి.