: కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తలు కొట్టుకున్నారు
నల్గొండ జిల్లా చందంపేట మండలం నేరడికొమ్ముచర్ల తండాలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, కాంగ్రెస్ కార్యకర్తలు పరస్పరం రాళ్ల దాడికి దిగారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. నడిగూడెం మండలం సిరిపురంలో కూడా కాంగ్రెస్, టీడీపీ వర్గీయులు బాహాబాహీకి దిగారు. అనంతరం రాళ్లు రువ్వుకోవడంతో నలుగురు గాయపడ్డారు.