: ఎన్నికల బరి నుంచి తప్పుకున్న టీడీపీ రెబెల్
విజయనగరం జిల్లా చీపురుపల్లి శాసనసభ స్థానంలో టీడీపీ రెబెల్ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ ఎంపీ కె.రామ్మోహన్ రావు పోటీ నుంచి వైదొలిగారు. తన అభిమానులు, టీడీపీ కార్యర్తలు ఇచ్చిన సూచనల మేరకే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. టీడీపీ టికెట్ రాకపోవడంతో ఆయన ఇండిపెండెంట్ గా నిలబడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనకు కేటాయించిన గుర్తుపై ఎవరూ ఓటు వేయరాదని విజ్ఞప్తి చేశారు.