: కమలం గుర్తుకు ఓటేసిన టీడీపీ అధినేత చంద్రబాబు


టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 66లో బీఎస్ఎన్ఎల్ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు వేశారు. ఆయనతో పాటు ఆయన భార్య భువనేశ్వరి, కొడుకు నారా లోకేష్, కోడలు బ్రాహ్మణి కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. సుమారు అరగంట సేపు క్యూలో నిల్చుని వారు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఈ సందర్భంగా అందరూ తమ ఓటుహక్కు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. కాగా ఆయన ఓటు హక్కు వినియోగించుకున్న నియోజకవర్గంలో ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలను బీజేపీకి కేటాయించడంతో ఆయన తన పార్టీకి ఓటు వేసే అవకాశం లేకుండాపోయింది. దీంతో పొత్తు ధర్మంలో భాగంగా కమలం గుర్తుకు ఓటేసినట్టు చంద్రబాబు చెప్పారు.

  • Loading...

More Telugu News