: పోలింగ్ సిబ్బందిని బెంబేలెత్తిస్తున్న పాములు...ఒక అధికారిని కాటేసిన పాము
ఎన్నికల్లో పోలింగ్ సిబ్బందిని పాములు బెంబేలెత్తిస్తున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా కేశంపేట మండలం దేవునిగుడి తండాలో పోలింగ్ అధికారి హుసలయ్యను పాము కరిచింది. వెంటనే ఆయనను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని తౌండుపల్లి పోలింగ్ కేంద్రం ఆవరణలో ఓ నాగుపాము కుబుసంతో కొన్ని గంటలపాటు కదలకుండా అలాగే ఉంది. అది ఉన్నంతసేపు ఎన్నికల సిబ్బంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఎలాగోలా దానిని అక్కడ్నుంచి వెళ్లగొట్టడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.