: దేశవ్యాప్తంగా 89 లోక్ సభ స్థానాల్లో కొనసాగుతున్న పోలింగ్
సార్వత్రిక ఎన్నికల మహా క్రతువులో భాగంగా నేడు ఏడో దశ పోలింగ్ జరుగుతోంది. మోడీ స్వరాష్ట్రమైన గుజరాత్ లోని మొత్తం 26 స్థానాలకు, తెలంగాణలోని మొత్తం 17 స్థానాలకు, పంజాబ్ లోని మొత్తం 13 స్థానాలకు, ఉత్తరప్రదేశ్ లో 14, బీహార్ లో 7, పశ్చిమబెంగాల్లో 9, జమ్మూ కాశ్మీర్లో 1, డామన్ అండ్ డయ్యూలో 1, దాద్రా నగర్ హవేలీలోని 1 లోక్ సభ స్థానానికి ఓటింగ్ జరుగుతోంది. అలాగే, తెలంగాణలోని అన్ని శాసనసభ స్థానాలకు కూడా పోలింగ్ కొనసాగుతోంది. ఎక్కడా అవాంచనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.