: అమెరికాలో జరిగిన సైన్స్ పోటీల్లో టాపర్ గా భారతీయ విద్యార్థి!
అమెరికాలో జరిగిన సైన్స్ పోటీల్లో భారతీయ విద్యార్థి తన ప్రతిభను చాటి జయకేతనం ఎగురవేశాడు. కాలిఫోర్నియాలోని శ్యాన్ హ్యూసేకు చెందిన మొవ్వా నీల్ కాలిఫోర్నియాలో జరిగిన జూనియర్ సైన్స్ హ్యుమానిటీస్ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచాడు. దీంతో వాషింగ్టన్ డీసీలో జరిగిన తుది పోరులో అర్హత సాధించాడు. మొవ్వా నీల్ అమెరికాలోని హార్కర్ స్కూల్ లో 11వ తరగతి చదువుతున్నాడు. తుది పోటీల్లో అమెరికా విద్యార్థులకు మొవ్వా నీల్ గట్టి పోటీనిచ్చాడు. అమెరికా త్రివిధ దళాల ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో విజయం సాధించిన మొవ్వా నీల్ 12 వేల యూఎస్ డాలర్ల స్కాలర్ షిప్ ను అందుకున్నాడు.