: రేపు ఏడో విడత పోలింగ్ లో బరిలోకి దిగుతున్న ముఖ్యనేతలు


దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా... రేపు (బుధవారం) జరిగే ఏడో విడత పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు, ఏడు రాష్ట్రాల్లోని 89 లోక్ సభ నియోజకవర్గాల్లో జరుగనున్న ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తం తొమ్మిది విడతల్లో జరుగుతున్న ఎన్నికల్లో రేపు ఏడో విడత పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ఇప్పటికే పోలింగ్ సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు.

గుజరాత్ లోని 26 లోక్ సభ నియోజకవర్గాల్లో, తెలంగాణలోని 17 నియోజవకర్గాల్లో రేపు పోలింగ్ జరగనుంది. ఉత్తరప్రదేశ్ లో 14, పంజాబ్ లో 13, పశ్చిమ బెంగాల్ లో 9, బీహార్ లో 7, జమ్మూ-కాశ్మీర్ లోని ఒక నియోజకవర్గంలో ఎన్నికలు జరుగుతాయి. వీటితోపాటు కేంద్ర పాలిత ప్రాంతాలైన దాద్రానగర్ హవేలిలోని ఒక నియోజకవర్గంలో, డామన్-డయూలోని ఒక నియోజకవర్గంలోని లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. అలాగే మన రాష్ట్రంలో... తెలంగాణ ప్రాంతంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా పోలింగ్ బుధవారమే జరుగుతున్న విషయం విదితమే.

బుధవారం పోలింగ్ జరిగే నియోజకవర్గాల్లో ఆయా పార్టీలకు చెందిన ముఖ్య నేతలు పలువురు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, మధుసూధన్ మిస్త్రీ, శ్రీ ప్రకాష్ జైస్వాల్, భారతీయ జనతాపార్టీ నుంచి లాల్ కృష్ణ అద్వానీ, నరేంద్ర మోడీ, రాజ్ నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, ఉమాభారతి, మురళీ మనోహర్ జోషీ, జేడీయూ నుంచి శరద్ యాదవ్ తదితరులు పోటీపడుతున్నారు.

  • Loading...

More Telugu News