: మోడీ మాత్రమే ప్రజల్లో విశ్వాస స్పూర్తి నింపగలరు: అద్వానీ కుమారుడు


బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ మాత్రమే ప్రజల్లో విశ్వాస స్పూర్తి నింపగలరని ఎల్ కే అద్వానీ కుమారుడు జయంత్ అంటున్నారు. ఆయన అత్యంత ప్రజాదరణ పొందిన నేత అని ప్రశంసించారు. తన తండ్రి పోటీ చేస్తున్న గాంధీనగర్ కు ప్రచార ఇన్ ఛార్జిగా ఉన్న ఆయన, బీజేపీ, మోడీ వేర్వేరు కాదని, రెండూ ఒకటేనని చెప్పారు. ఆ రెంటినీ తాము విడదీసి చూడలేమనీ అన్నారు. ఈసారి ఎన్నికల్లో మోడీ ఓ ప్రధానమైన వ్యక్తి అని, కేంద్రంలో మార్పు కోసం ప్రజలు ఓటు వేస్తారనీ అన్నారు. అందుకని మోడీని, బీజేపీని ఒకటిగానే చూడాలని జయంత్ సూచించారు. గతంలో కంటే బీజేపీ ఈసారి చాలా మెరుగ్గా సీట్లు దక్కించుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News