: నేడే ఐపీఎల్ ఆరంభ వేడుక ... సందడి 'అదుర్సే' అంటున్న షారుఖ్


రేపటి నుంచి ఐపీఎల్-6 క్రికెట్ వినోదం షురూ కానున్న నేపథ్యంలో ఇవాళ ఆరంభ వేడుక అదిరిపోనుంది. కోల్ కతాలో ఫుట్ బాట్ మ్యాచ్ లకు ప్రసిద్ధి చెందిన సాల్ట్ లేక్ స్టేడియంలో ఈ ప్రారంభ వేడుక జరుపబోతున్నారు. క్రితం ఏడాది టైటిల్ గెల్చుకున్న షారూఖ్ నైట్ రైడర్స్ ఆధ్వర్యంలో కళ్లు మిరుమిట్లు గొలిపేలా ఓపెనింగ్ సెర్మని ఉండబోతోంది. ఈ విషయాన్ని సాక్షాత్తూ షారూఖే చెప్పాడు. 

ఈ ప్రారంభోత్సవ వేడుకకు షారూఖే పెద్ద ఆకర్షణ కాగా, ఇంకా బాలీవుడ్ అందాల భామలు కత్రినా కైఫ్, దీపికా పదుకునే కొన్ని ప్రత్యేక సినిమా గీతాలకు డ్యాన్స్ చేయనున్నారు. ఇక ప్రముఖ రాప్ సంగీత కళాకారుడు పిట్ బుల్ ఆధ్వర్యంలో మరో ప్రత్యేక ప్రదర్శన ఉంటుంది. ఇంకోపక్క చీర్ లీడర్లు గాల్లోకి లేస్తూ ఇచ్చే ప్రదర్శన, ఇక డ్రమ్మర్లు, జిమ్నాస్ట్ లు, డ్యాన్సర్లు.. బాణా సంచావెలుగులు..
 
ఒకటేమిటి అబ్బో... కేక పుట్టిస్తామంటున్నాడు షారూఖ్. బాలీవుడ్ బాద్ షా నే స్వయంగా ఇలా చెబితే ఇక కార్యక్రమం ఎలా ఉండబోతోందో ఇప్పుడే కళ్లకు కడుతుంది కదూ.. బీ రెడీ... సాయంకాలానికి!

  • Loading...

More Telugu News