: మే 3 వరకు బీహార్ బీజేపీ నేతకు ఊరట


వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డ బీహార్ బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ కు కొన్ని రోజుల పాటు ఊరట లభించింది. ఈ మేరకు మే 3వ తేదీ వరకు అరెస్టు చేయవద్దని దేవగడ్ కోర్టు ఆదేశాలిచ్చింది. అదేరోజు మరోసారి వాదనలు విన్నాక తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. కాగా, అంతకుముందు పోలీసుల నుంచి అరెస్టును తప్పించుకునేందుకు గిరిరాజ్ మధ్యంతర బెయిల్ కు దాఖలు చేయగా జార్ఖండ్ కోర్టు తిరస్కరించింది. మోడీకి ఓటు వేయటం ఇష్టంలేని వాళ్లు పాకిస్థాన్ కు మద్దతుదారులంటూ ఓ ర్యాలీలో గిరిరాజ్ చేసిన ప్రసంగం కలకలం రేపింది. దాంతో, ఎన్నికల సంఘం ఆదేశంతో బొకారో జిల్లా, దేవగడ్ జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి.

  • Loading...

More Telugu News