: ఇవాళ్టి పవన్ కల్యాణ్ పర్యటన రద్దు


సినీ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ గుంటూరు జిల్లా పర్యటన రద్దయింది. షెడ్యూల్ ప్రకారం ఇవాళ గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట, నరసరావుపేట నియోజకవర్గాల్లో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించాల్సి ఉంది. అయితే, అనివార్య కారణాల వల్ల పవన్ కల్యాణ్ పర్యటన రద్దు అయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పవన్ కల్యాణ్ ఈ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతుగా ప్రచారం చేస్తున్న విషయం విదితమే.

  • Loading...

More Telugu News