: మోడీ ప్రభంజనానికి కేసీఆర్ భయపడుతున్నారు: ప్రకాశ్ జవదేకర్


టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై బీజేపీ ప్రత్యక్ష విమర్శలకు దిగింది. తమ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ ప్రభంజనానికి కేసీఆర్ భయపడుతున్నారని అధికార ప్రతినిధి ప్రకాష్ జవదేకర్ వ్యాఖ్యానించారు. అందుకే ఆయన అభ్యంతరకర భాష మాట్లాడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్, ఎంఐఎంపై కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించిన జవదేకర్... ఇద్దరు ఎంపీలతో తెలంగాణ వస్తుందా? అని సూటిగా నిలదీశారు. బీజేపీకి తెలంగాణ, సీమాంధ్ర రెండు కళ్లలాంటివని పేర్కొన్నారు. రేపు, ఎల్లుండి సీమాంధ్రలో మోడీ ప్రచారం చేస్తారని, ఇక్కడి ఆరు సభల్లోనూ చంద్రబాబు, పవన్ కల్యాణ్ పాల్గొంటారని తెలిపారు.

  • Loading...

More Telugu News