: విద్యార్థులకు మార్షల్ ఆర్ట్స్ తప్పనిసరి చేయాలని అక్షయ్ సూచన
థాయ్ లాండ్ లో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని వచ్చిన బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ దీన్ని స్కూల్ విద్యార్థులకు తప్పకుండా నేర్పించాలంటున్నాడు. మార్షల్ ఆర్ట్స్ ను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. స్కూల్ దశలో ప్రతీ విద్యార్థి కనీసం మూడేళ్ల పాటు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నట్లయితే, అప్పుడు క్రికెట్ కంటే ప్రాచుర్యం పొందుతుందని, అది తన కలగా చెప్పాడు. చైనా, సింగపూర్ లో ఇదే విధానం కొనసాగుతుందని ఉదాహరణ పేర్కొన్నాడు.