: నిపుణుల మాటలు నిజం చేసిన యూనివర్సిటీ విద్యార్థులు
సామాజిక నెట్ వర్క్ సైట్ ఫేస్ బుక్ అమెరికాలోని బేలన్ యూనివర్సిటీ విద్యార్థులకు భలే ఉపయోగపడింది. ఫేస్ బుక్ లో గ్రూప్స్ బేలన్ యూనివర్సిటీకి చెందిన సోషియాలజీ విద్యార్థులు మిత్రులుగా ఉన్నారు. స్కూళ్లు, కళాశాలల్లో పాఠ్యపుస్తకాలు చదివితే సరిపోతుంది. అదే ఉన్నత విద్యకొచ్చేసరికి విస్తృతమైన అవగాహన, అంతులేని అధ్యయనం అవసరం. ఇందుకు లైబ్రరీలు, మిత్రులు, అనుభవజ్ఞుల సలహాలు, సూచనలు చాలా అవసరం.
పుస్తకాల పని తక్కువ, అనుభవాలు, అధ్యయన సారం ఎక్కువగా ఉండే సోషియాలజీలో బేలన్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు ఫేస్ బుక్ ఉపయోగించుకుని అద్భుతమైన అధ్యయనం చేశారని యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ కెవిన్ డౌర్టీ చెప్పారు. బోధన సవాళ్లను విద్యార్థులు ఫేస్ బుక్ ద్వారా అధిగమించారని ఆయన అభినందించారు.
218 మంది విద్యార్థులను గమనించిన తరువాత యూనివర్సిటీ ఈ విషయాన్ని వెల్లడించింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని మంచికి ఉపయోగిస్తే మంచి జరుగుతుందని, చెడుకు ఉపయోగిస్తే చెడు జరుగుతుందని నిపుణులు చెబుతున్న మాటల్ని బేలన్ యూనివర్సిటీ విద్యార్థులు నిజం చేశారు.