: ఉస్మానియా వర్శిటీ పరీక్షలు... ఇప్పుడు మళ్లీ వాయిదా పడ్డాయ్!


రాష్ట్రంలో ఎన్నికలు పూర్తయ్యే వరకు ఉస్మానియా విద్యార్థులు పరీక్షలు రాసే పరిస్థితులు కనిపించటం లేదు. ఎందుకంటే ఉస్మానియా వర్శిటీలోని వివిధ కోర్సులకు చెందిన సెమిస్టర్ పరీక్షలు మళ్లీ వాయిదా పడ్డాయి. షెడ్యూల్ ప్రకారం పరీక్షలు ఏప్రిల్ 25వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సిన ఉన్నా 30న జరిగే ఎన్నికల దృష్ట్యా మే 3వ తేదీకి వాయిదా వేశారు. అయితే, ఇప్పుడు ఓట్ల లెక్కింపు ఉండటంతో పరీక్షలు మళ్లీ వాయిదా పడ్డాయి.

సాధారణ ఎన్నికలు, ఓట్ల లెక్కింపు వంటి కారణాలతో ఈసారి పరీక్షలను మే 19వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ఓయూ రిజిస్ట్రార్ ప్రొ. ప్రతాప్ రెడ్డి తెలిపారు. ఉస్మానియా వర్శిటీ క్యాంపస్ తో పాటు అనుబంధ కళాశాలల్లో నిర్వహిస్తున్న పీజీ కోర్సులు, బీఈ, బీటెక్, ఎంబీఏ సెమిస్టర్ పరీక్షలు మే 19 నుంచి మొదలవుతాయని ఆయన వెల్లడించారు. ఓయూ పరీక్షల సమయ సూచిక, ఇతర వివరాల కోసం విద్యార్థులు www.osmania.ac.in వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చునని వర్శిటీ వర్గాలు తెలిపాయి.

  • Loading...

More Telugu News