: బుకీలు... లోక్ సభ ఎన్నికల్లో విజేతను డిసైడ్ చేశారు
2014 లోక సభ ఎన్నికల్లో అధికారం దక్కించుకునే విజేత ఎవరనేది బుకీలు డిసైడ్ చేసేశారు. గుజరాత్ లోని రాజ్ కోట్, అహ్మదాబాద్, మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన బుకీలు రాహుల్ ప్రధాని అవుతారన్న దానిపై పందేలకు అనుతించడం లేదట. ప్రస్తుతం వీరంతా మోడీ ప్రధాని అన్న దానిపైనే పందేలు కాస్తున్నారట. తదుపరి ప్రధాని నరేంద్రమోడీయేనంటూ 45 పైసల పందెం నడుస్తోంది. అంటే మోడీయే ప్రధాని అయితే, పందెంలో పెట్టిన ప్రతి రూపాయికి 1.45పైసలు చేతికి వస్తుంది. నెల క్రితం రాహుల్ పై 6,7 రూపాయలు, కేజ్రీవాల్ పై 500-525వరకు పందేలు నడిచాయట. ఇప్పుడు మాత్రం పందేలన్నీ మోడీ దగ్గరకు వచ్చి ఆగిపోయాయి.