: జైలుకి పంపితే అక్కడే టీ స్టాల్ పెట్టుకుంటా: మోడీ


తనకు అధికారం ఇచ్చి ఢిల్లీకి పంపాలని బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీ గుజరాత్ ప్రజలకు పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ను స్మరించుకోవాలని సూచించారు. అమ్రేలీలో ఈరోజు జరిగిన సభలో మోడీ మాట్లాడారు. ఒక వేళ తనను జైలుకి పంపితే, అక్కడే ఒక టీ స్టాల్ పెట్టుకుంటానన్నారు. గుజరాత్ లో లోకాయుక్త ఉంటే మోడీ జైలుకే అన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యల నేపథ్యంలో మోడీ ఇలా అన్నారు. రాహుల్ అబద్ధాలు చెబుతున్నారని, తమ రాష్ట్రంలో ఇప్పటికే లోకాయుక్త ఉందని స్పష్టం చేశారు. తనని జైలుకు పంపడానికి కాంగ్రెస్ అన్ని యత్నాలు చేసి విఫలమైందని, ఒక వేళ జైలుకి పంపితే అందులో టీ స్టాల్ నడపడానికి సిద్ధమని ప్రకటించారు.

  • Loading...

More Telugu News