: శ్రీనివాసుడి దర్శనం లభించకుండానే అనంత లోకాలకు


తిరుమల శ్రీనివాసుడి దర్శనం కోసం వెళుతున్న వారిని విధి బలితీసుకుంది. మహబూబ్ నగర్ జిల్లా నుంచి తిరుపతికి తుఫాన్ వాహనంలో వెళుతుండగా, వైఎస్సార్ కడప జిల్లా పుల్లంపేట మండలం పూతనవారిపల్లె వద్ద వాహనం ప్రమాదానికి గురైంది. రోడ్డుకు అడ్డుగా వచ్చిన చిన్నారిని తప్పించినా లాభం లేకపోయింది. వాహనం చిన్నారిని ఢీకొట్టి బోల్తాకొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నారితోపాటు వాహనంలో ఉన్న ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండగా వారిని రాజంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News