: నిబంధనలు ఉల్లంఘిస్తే సహించం: పోలీస్ కమిషనర్
తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి గడువు ముగిసిపోవడంతో... అన్ని పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు ప్రచారాన్ని నిలిపివేయాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల సంఘం నిబంధనలను ఉల్లంఘించే వారిని సహించమని హెచ్చరికలు జారీ చేశారు. 30వ తేదీన జరగనున్న ఎన్నికల కోసం 37 కంపెనీల కేంద్ర బలగాలను వినియోగిస్తున్నామని చెప్పారు. అలాగే 20 వేల మంది పోలీసులను నియమించామని అన్నారు. ఎన్నికలకు ఆటంకం కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. బల్క్ ఎస్ఎంఎస్ లను నిషేధించినట్టు తెలిపారు.