: ప్రజారాజ్యం టికెట్ల అమ్మకాల్లో పవన్ వాటా ఎంత?: కవిత
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై టీఆర్ఎస్ నాయకురాలు, కేసీఆర్ కుమార్తె కవిత మండిపడ్డారు. ఆయనకు కొంచెం తిక్క ఉందని, కానీ దానికి లెక్క లేదని అన్నారు. మోడీ ప్రధాని అవుతారనే భ్రమలో పవన్ ఉన్నారని... అందుకే ఆయన పక్కన చేరారని తెలిపారు. ఇది సినిమా కాదని, ఇక్కడ రీటేకులు ఉండవని చెప్పారు. తన అన్న చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో టికెట్లు అమ్ముకున్న వ్యవహారంలో పవన్ వాటా ఎంతో చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ మాటలను తెలంగాణ ప్రజలు నమ్మరని అన్నారు.