: ఫరూక్ జీ! ఓసారి అద్దంలో చూసుకోండి: మోడీ


లౌకికవాదం గురించి ఫరూక్ అబ్దుల్లా మాట్లాడే ముందు ఓసారి అద్దంలో చూసుకోవాలని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ సూచించారు. ఈ మేరకు గుజరాత్ లోని బీజేపీ కార్యాలయం ఒక వీడియోను విడుదల చేసింది. భారత రాజ్యాంగంలో లౌకికవాదమనే పదాన్ని చేర్చడం ద్వారా లౌకికవాదం రాలేదని, వేల సంవత్సరాలుగా భారత దేశంలో అన్ని ధర్మాలు ఒక్కటే అనే భావం బలంగా ఉందని, దాని కారణంగా భారత రాజ్యంగంలో లౌకికవాదం చేరిందని మోడీ తెలిపారు.

దేశంలో మొదటగా లౌకికవాదం దెబ్బతిన్నది జమ్మూకాశ్మీర్ లోనేనని ఆయన గుర్తు చేశారు. ఫరూక్ తండ్రి నుంచి, ఆయన కొడుకు ఒమర్ అబ్దుల్లా రాజకీయాల వరకు లౌకికవాదానికి తీవ్ర నష్టం జరిగిందని ఆరోపించారు. కాశ్మీర్ నుంచి పండిట్లను వెళ్లగొట్టారని ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా ఫరూక్ చేసిన వ్యాఖ్యలను మోడీ ఖండించారు.

  • Loading...

More Telugu News