: స్వచ్ఛమైన పాలన కోసం విజయారెడ్డిని గెలిపించండి: వైఎస్ జగన్
ఖైరతాబాద్ నియోజకవర్గంలో స్వచ్ఛమైన పాలన కోసం పోటీ చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయారెడ్డిని గెలిపించాలని ఆ పార్టీ అధినేత జగన్ కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖైరతాబాద్ నియోజకవర్గంలోని బీఎస్ మక్తాలో ఆయన మాట్లాడారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నేతలు విస్మరిస్తున్నారని, కానీ ఇచ్చిన మాటకు కట్టుబడిన పార్టీ వైఎస్సార్సీపీ అని ఆయన అన్నారు. తెలంగాణలో ఈసారి కాకున్నా, భవిష్యత్తులో వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని జగన్ విశ్వాసం వ్యక్తం చేశారు. రాజకీయ వ్యవస్థలో కొత్తవారిని ఎన్నుకోవాలని, వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.