: ఆమ్ ఆద్మీ పార్టీని అందరూ ఆదరిస్తున్నారు: ఛాయారతన్
అవినీతిని నిర్మూలించాలనే నినాదంతో పుట్టుకొచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీని హైదరాబాదు వాసులు ఆదరిస్తున్నారని ఆ పార్టీ తరపున పోటీ చేస్తున్న సికింద్రాబాదు లోక్ సభ అభ్యర్థి ఛాయారతన్ అన్నారు. ఇంతకాలం అధికారంలో ఉన్న ప్రధాన పార్టీలు ప్రజల సొమ్మును భారీగా దోచుకున్నాయని ఆమె ఆరోపించారు. అవినీతితో విసిగిపోయిన ప్రజలు ఇప్పుడు మార్పు కోరుకుంటున్నారని ఆమె అన్నారు.