: ఈజిప్టులో 680 మందికి పైగా మరణశిక్ష
హింస, హత్యలకు పాల్పడిన కేసులో 680 మందికి పైగా ఇస్లామిస్టులకు ఈ రోజు మిన్యాలోని కోర్టు మరణశిక్ష ఖరారు చేసింది. వీరిలో ముస్లిం బ్రదర్ హుడ్ నేత మొహమ్మద్ బడీ కూడా ఉన్నారు. ఈ విషయాన్ని ప్రాసిక్యూటర్లు తెలిపారు. ఈజిప్టు మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ మోర్సి మద్దతు దారులకు, పోలీసులకు మధ్య గతేడాది ఆగస్టులో ఘర్షణ జరిగింది. ఈ సందర్భంగా పోలీసులను హత్య చేసినందుకు కోర్టు నిందితులకు మరణశిక్ష విధించింది. ఈ తీర్పు విన్న వెంటనే నిందితుల కుటుంబ సభ్యులు కొందరు కోర్టు ఆవరణలోనే మూర్చిల్లారు. ఈ మరణశిక్షలకు ఇస్లాం అత్యున్నత అధికారి ముర్ఫి ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది.