: సునీల్ శెట్టిపై పరువునష్టం కేసును కొట్టేసిన కోర్టు


నటుడు సునీల్ శెట్టిపై పరువునష్టం కేసులో విచారణను ఢిల్లీలోని స్థానిక కోర్టు నిలిపివేసింది. నటుడి ప్రతిష్ఠను దెబ్బతీయడానికి వేసిన పిటిషన్ అని కోర్టు తేల్చింది. పరువునష్టం దావాకు సంబంధించి కనీసం ప్రాథమిక సాక్ష్యాధారాలు కూడా లేవని, చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ ఈ కేసు దాఖలు చేశారని చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సావిత్రి స్పష్టం చేశారు. సునీల్ శెట్టి దగ్గర నుంచి డబ్బులు గుంజడానికే ఈ దావా వేశారని తేలుస్తూ విచారణను నిలిపివేశారు. ఈ వ్యాజ్యాన్ని స్టంట్ మ్యాన్ పూరన్ చౌహాన్ గతేడాది అక్టోబర్ లో దాఖలు చేశారు.

  • Loading...

More Telugu News