: కన్యాకుమారి నుంచి ఢిల్లీకి 4,160కిలోమీటర్ల మేర కాలినడక


ఓ ప్రవాస భారతీయుడి హృదయం దాతృత్వ కార్యక్రమాలకు కదిలింది. 79 ఏళ్ల వయసులో కన్యాకుమారి నుంచి ఢిల్లీ వరకు 4,160 కిలోమీటర్ల మేర సుదూరాన్ని కాలినడకన వెళుతూ విరాళాలు సేకరించాలని సంకల్పించారు. ఆయన పేరే బాబీ గ్రెవాల్. ఈ ఏడాది డిసెంబర్ 1న కన్యాకుమారిలో బాబీ తన యాత్రను ప్రారంభించి వచ్చే ఏడాది ఏప్రిల్ 30న ఢిల్లీ చేరుకుంటారు. దారి పొడవునా సేకరించిన విరాళాలను సేవ్ చిల్డ్రన్ ఇంటర్నేషనల్ సంస్థకు అందించనున్నారు. బాబీకి కాలినడక కొత్తేమీ కాదు. లోగడ అమృత్ సర్ నుంచి కన్యాకుమారి వరకు నడచి, లక్ష పౌండ్ల విరాళాలను సేకరించారు.

  • Loading...

More Telugu News