: మర్రి జనార్థనరెడ్డి కాన్వాయ్ కి 'కోడిగుడ్ల' సన్మానం


మహబూబ్ నగర్ అసెంబ్లీ టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్థనరెడ్డి కాన్వాయ్ కి గద్వాల మండలం గాజులపల్లిలో కోడిగుడ్ల సన్మానం జరిగింది. ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న జనార్థనరెడ్డి కాన్వాయ్ పై కాంగ్రెస్ కార్యకర్తలు గుడ్లతో దాడి చేశారు. దీంతో టీఆర్ఎస్ కార్యకర్తలు ఎదురు దాడికి పాల్పడ్డంతో, రెండు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీలకు పని చెప్పి ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఈ ఘటనలో పలువురు కార్యకర్తలు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

  • Loading...

More Telugu News