: మోడీ ఓటర్లు సముద్రంలో మునిగిపోతారు: ఫరూక్ అబ్దుల్లా
జమ్మూ కాశ్మీర్ కు చెందిన ఎన్సీ అధినేత ఫరూక్ అబ్దుల్లా, బీజేపే నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. మోడీ వ్యతిరేకులు ఎన్నికల అనంతరం పాకిస్థాన్ కు వెళ్లాల్సి ఉంటుందని లోగడ బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై అబ్దుల్లా స్పందిస్తూ... మోడీకి ఓటేసిన వారు సముద్రంలో మునిగిపోతారని అన్నారు. అలాగే, ఈ దేశం మతతత్వ దేశంగా మారిపోతే తాము దేశం నుంచి విడిపోతామని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన నిన్న శ్రీనగర్ లో జరిగిన ర్యాలీలో మాట్లాడారు. దీనిపై బీజేపీ అగ్రనేత జైట్లీ ఈ రోజు స్పందించారు. బాధ్యత కలిగిన అబ్దుల్లా ఇలా ఎందుకు మాట్లాడుతున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు. లౌకిక వాదం గురించి మాట్లాడే బదులు వలస వెళ్లిన కాశ్మీరీ పండిట్లను తిరిగి వెనక్కి తీసుకువచ్చేందుకు కృషి చేయాలని సూచించారు.