: పవన్ కల్యాణ్ పిచ్చోడిలా మాట్లాడుతున్నాడు: కవిత
సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిచ్చోడిలా మాట్లాడుతున్నాడని టీఆర్ఎస్ అభ్యర్థి కవిత మండిపడ్డారు. నిజామాబాద్ లో కేసీఆర్ సభ ఏర్పాట్లు పర్యవేక్షించిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ మాయమాటలను తెలంగాణ ప్రజలు పట్టించుకోరని అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ దే విజయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు.