: మల్కాజిగిరిలో గెలుపు నాదే: దినేష్ రెడ్డి ధీమా
‘మల్కాజిగిరిలో గెలుపు నాదే‘నని దినేష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆయన వైఎస్సార్ కాంగ్రెెస్ పార్టీ తరపున లోక్ సభ అభ్యర్థిగా బరిలోకి దిగిన విషయం తెలిసిందే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఉన్న ప్రజాదరణ, తన గత చరిత్ర, జగన్ నాయకత్వంపై ప్రజలకు ఉన్న నమ్మకమే తనను గెలిపిస్తాయని ఆయన చెప్పుకొచ్చారు. హైదరాబాదులో ఇవాళ దినేష్ రెడ్డి మీడియాతో తన మనోభావాలను పంచుకున్నారు. మల్కాజిగిరిలో పోటీలో ఉన్న అభ్యర్థుల్లో సచ్ఛీలత తన ఒక్కడికే ఉందన్నారు. నియోజకవర్గంలో తాగునీటి సమస్యను పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు.