: ఓటర్లకు పంచేందుకు దాచి పెట్టిన మద్యం బయటపడింది


ఎన్నికలు దగ్గర పడటంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నారు. పోలీసులు నిఘా పెట్టినా, పెద్ద మొత్తంలో నగదు, మద్యం పట్టుకుంటున్నా ఈ ప్రలోభాల పర్వం నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది.

తాజాగా మహబూబ్ నగర్ జిల్లాలోని ఓ కాంగ్రెస్ నేత ఫాంహౌస్ లో దాచి పెట్టిన మద్యం బయటపడింది. జిల్లాలోని కొడంగల్ మండలం ఆలేరులో ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కాంగ్రెస్ నేత కృష్ణకు చెందిన వ్యవసాయ క్షేత్రంలో 65 కార్టన్ల మద్యాన్ని గుర్తించి, స్వాధీనం చేసుకున్నామని ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. పట్టుబడిన మద్యం విలువ సుమారు రూ. 4 లక్షలు ఉంటుందని వారు వెల్లడించారు.

  • Loading...

More Telugu News