: విజయనగరంలో 28 కిలోల వెండి పట్టుబడింది


ఎన్నికల నేపథ్యంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. విజయనగరంలోని వై జంక్షన్ వద్ద కారులో తరలిస్తుండగా 28 కిలోల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓటర్లకు పంచిపెట్టేందుకే ఈ వెండిని తీసుకెళ్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. పట్టుబడిన వెండిలో మహిళలు పెట్టుకునే కాళ్ల పట్టీలు ఎక్కువగా ఉన్నాయి. దీనికి బాధ్యులైన ఇద్దరు వ్యాపారులను కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. విశాఖ నుంచి విజయనగరం తీసుకెళ్తుండగా ఈ వెండి వస్తువులను పట్టుకున్నారు.

  • Loading...

More Telugu News