: తెలంగాణలో నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం


తెలంగాణలో ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ప్రచారం ముగియనుంది. తెలంగాణ జిల్లాల్లోని 17 లోక్ సభ, 119 శాసనసభ స్థానాలకు ఈ నెల 30వ తేదీన ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో 11 నక్సలైట్ ప్రభావిత నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే ఎన్నికల ప్రచారం ముగించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్ లాల్ ఆదేశించారు. 17 లోక్ సభ, మిగిలిన 108 శాసనసభ స్థానాల్లో మాత్రం సాయంత్రం 6 గంటల వరకు ప్రచారం చేసుకోవచ్చని తెలిపారు. ఎన్నికల ప్రచారం ముగిసిన తరువాత రాజకీయ పార్టీలు, అభ్యర్ధులు ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే చర్యలకు పాల్పడే అవకాశం ఉన్నందున ఇంటింటి ప్రచారాన్ని కూడా నిషేధించినట్టు చెప్పారు.

  • Loading...

More Telugu News