: భద్రాచలంలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కృషి: స్పీకర్
గిరిజనుల సమస్యల పరిష్కారానికి నేనున్నానని స్పీకర్ నాదేండ్ల మనోహర్ అభయమిచ్చారు. ఇవాళ ఆయన ఖమ్మం జిల్లా - ఛత్తీస్ ఘడ్ సరిహద్దు ప్రాంతంలోని మారుమూల గిరిజన తండాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా గిరిజనుల కష్ట సుఖాలను అడిగి తెలుసుకుని వారితో సహపంక్తి భోజనాలు చేశారు. భద్రాచలం కేంద్రంగా గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ప్రయత్నిస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.