: నవ తెలంగాణ కోసం కాంగ్రెస్ నే గెలిపించాలి: అజారుద్దీన్
నవ తెలంగాణ నిర్మాణం కోసం కాంగ్రెస్ పార్టీనే గెలిపించాలని క్రికెట్ మాజీ కెప్టెన్ అజారుద్దీన్ కోరారు. ఈ రోజు ఆయన నిజామాబాద్ జిల్లాలోని రెంజల్, కందకుర్తి, నీల, తాటాపూర్ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేశారు. నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి మధుయాష్కీ, ఎమ్మెల్యే అభ్యర్థి సుదర్శన్ రెడ్డి తరపున ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్రంలోను, రాష్ట్రంలోను కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టాలని కోరారు.