: మాజీ ఎమ్మెల్యే బాపినీడు మృతి
కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే చిట్టూరి బాపినీడు (78) గుండెపోటుతో ఈ ఉదయం తణుకులోని తన నివాసంలో కన్నుమూశారు. 2004లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈయన తణుకు శాసనసభ స్థానం నుంచి విజయం సాధించారు. బాపినీడు అంత్యక్రియలు రేపు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.