: రాష్ట్రంలో కాంగ్రెస్ కు మూడు స్థానాలు కూడా రావు: జవదేకర్
రాష్ట్రంలో కాంగ్రెస్ కు మూడు లోక్ సభ సీట్లు కూడా రావని, ఈ విషయంలో తాను సవాల్ చేస్తున్నానని బీజేపీ జాతీయ నేత ప్రకాశ్ జవదేకర్ అన్నారు. ఆయన ఈ రోజు హైదరాబాద్ లో మాట్లాడారు. మోడీ హవా చాలా స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ప్రజలు స్థిరమైన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని, మోడీకి అధికారం కట్టబెట్టాలని అనుకుంటున్నారని చెప్పారు.