: రేపటితో ముగియనున్న తెలంగాణలో ఎన్నికల ప్రచారం
రాష్ట్రంలో తొలిదశ ఎన్నికలు జరుగుతున్న తెలంగాణలో రేపటితో ప్రచార పర్వానికి తెరపడనుంది. 30వ తేదీన తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పోలింగ్ తేదీకి రెండు రోజుల ముందు వరకే ప్రచారం కొనసాగించాలి. ఈ నేపథ్యంలో, తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి రేపు (28వ తేదీ) తుది రోజు కానుంది.