: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఆర్.ఎం.లోధా ప్రమాణ స్వీకారం


భారత సుప్రీంకోర్టు 41వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఆర్.ఎం.లోధా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జస్టిస్ లోధాతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మన్మోహన్ సింగ్, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, కేంద్ర మంత్రి కపిల్ సిబల్ తదితరులు హాజరయ్యారు. చీఫ్ జస్టిస్ గా పి.సదాశివం పదవీ కాలం ముగియడంతో... సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో తర్వాత సీనియర్ అయిన లోధా ఆ బాధ్యతలు చేపట్టారు. ఈయన ఈ ఏడాది సెప్టెంబర్ 27 వరకు సేవలు అందించనున్నారు.

  • Loading...

More Telugu News