: నేడు చేవెళ్ల, ఆందోల్ లో సోనియా సభలు
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఈ రోజు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, మెదక్ జిల్లా ఆందోల్ లో జరిగే సభల్లో పాల్గొననున్నారు చేవెళ్ల లోక్ సభ స్థానం నుంచి కార్తీక్ రెడ్డి, ఆందోల్ అసెంబ్లీ స్థానం నుంచి దామోదర రాజనరసింహ పోటీ చేస్తున్నారు. ఈ స్థానాల్లో కాంగ్రెస్ కు ప్రతికూలత నెలకొంది. పైగా రేపటితో తెలంగాణలో ఎన్నికలకు ప్రచారం ముగియనుండడంతో సోనియా సభలను తెలంగాణ పీసీసీ ఇక్కడ ఏర్పాటు చేసింది. అధినేత్రి సభకు జనసమీకరణ పెద్ద ఎత్తున చేయాలని నేతలు ప్రయత్నిస్తున్నారు.