: ఎంతమంది చిరంజీవులు వచ్చినా కాంగ్రెస్ మృతజీవి: వెంకయ్య ధ్వజం


కేంద్ర మంత్రి చిరంజీవిపై బీజేపీ అగ్రనేత వెంకయ్యనాయుడు ధ్వజమెత్తారు. ఎంత మంది చిరంజీవులు వచ్చినా కాంగ్రెస్ మాత్రం చిరంజీవి(ఎప్పటికీ జీవించి ఉండేవారు) కాలేదని, ఆ పార్టీ మృతజీవి అని వెంకయ్య ఎద్దేవా చేశారు. తొలుత చిరంజీవి కాంగ్రెస్ ను దునుమాడి, తర్వాత తన పార్టీని కాంగ్రెస్ లో కలిపేశారని, మునిగే పడవలో కాలు పెట్టారని అన్నారు. చిరంజీవి కేంద్ర సహాయ మంత్రి కాదని, అసహాయమంత్రి అని వ్యాఖ్యానించారు. లూటర్స్, చీటర్స్ ను ప్రజలు నమ్మడం లేదన్నారు. తిరుపతి, విశాఖపట్టణంలో జరిగే సభల్లో మోడీతో కలసి పవన్ కల్యాణ్ పాల్గొంటారని చెప్పారు. టీడీపీకి వార్డు స్థాయి నుంచి కార్యకర్తల బలం ఉందని, టీడీపీ, బీజేపీ రెండూ కలిస్తే, రాష్ట్రం, దేశం అభివృద్ధిలో ముందుకు వెళతాయన్నారు. ఎన్నికల తర్వాత కూడా టీడీపీతోనే పొత్తు ఉంటుందన్నారు. లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ వంటివారు పార్లమెంటులో ఉండాలన్నది తన ఆకాంక్ష అని, అయితే పొత్తుకు కట్టుబడి మల్కాజ్ గిరిలో తమ మద్దతు టీడీపీ అభ్యర్థికేనన్నారు. ధన, కుల బలం కాకుండా, వ్యక్తి గుణగణాలు చూసి ఓటేయాలని కోరారు.

  • Loading...

More Telugu News