: విశాఖలో మరో చిట్టీల మోసం... రూ.3 కోట్లు హాంఫట్
చిట్టీల పేరుతో మోసాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. మొన్న హైదరాబాదులో చిట్టీల పేరుతో విజయరాణి కోట్లాది రూపాయలను కొల్లగొడితే... తాజాగా విశాఖపట్నంలోని అంగడిదిబ్బలో తల్లీకూతుళ్లు కలసి రూ.3 కోట్లు హాంఫట్ చేశారు.
విశాఖలో ఈ తల్లీ కూతుళ్లు చిట్టీల పేరుతో ప్రజల వద్ద నుంచి సుమారు మూడు కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఆ తర్వాత పెట్టీబేడా సర్దేశారు. విషయాన్ని ఆలస్యంగా గ్రహించిన బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఇప్పుడు ఆ తల్లీకూతుళ్ల కోసం వెతుకుతున్నారు.